రూ.కోటితో వృద్ధాశ్రమాన్ని కట్టి ప్రభుత్వానికి ఇచ్చిన జంట.. ప్రశంసించిన కేటీఆర్!

  • సత్యనారాయణ, జానకమ్మ దంపతుల వితరణ
  • ఆశ్రమం నిర్వహణ ప్రభుత్వానికి అప్పగింత
  • ట్విట్టర్ లో స్పందించిన టీఆర్ఎస్ నేత
సొంత నిధులతో వృద్ధాశ్రమాన్ని నిర్మించి ప్రభుత్వానికి అప్పగించిన ఓ జంటను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. చౌటుప్పల్ శ్రీ సత్యనారాయణ రెడ్డి, జానకమ్మ రూ.కోటి వ్యయంతో వృద్ధాశ్రమాన్ని నిర్మించారని కేటీఆర్ తెలిపారు.

అనంతరం ఈ ఆశ్రమం నిర్వహణను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించారని పేర్కొన్నారు. ఈ జంట చేసిన సాయం తన మనసును కదిలించివేసిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. సత్యనారాయణ రెడ్డి, జానకమ్మలతో దిగిన ఫొటోను మంత్రి తన ట్వీట్ కు జత చేశారు.
Go Back to Shorts
KTR
elderly home
orphange home
government
Twitter
RS.1 crore

More Telugu News